4రోజుల్లో లక్ష కరోనా కేసులు

4రోజుల్లో లక్ష కరోనా కేసులు

కరోనా మహామ్మారి ప్రపంచాన్నీ గజగజ వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.
కోవిడ్19 వైరస్ బీభత్సంగా విజృంభిస్తోంది.
ప్రపంచంలో మార్చి24 వరకు కరోనా కేసుల నమోదు
మొత్తం 3,78,751, కరోనా కొరల్లో చిక్కుకుని 16,502
మంది మృతి చెందారు. ఈ మొత్తం కరోనా వ్యాధి సోకిన వ్యక్తుల్లో లక్ష కేసులు నమోదు కావడానికి 67 రోజులు పట్టగా, రెండో లక్ష కేసులు నమోదు కావడానికి 11 రోజులు పట్టింది. అదే మూడో లక్ష కేసులు నమోదు చేరుకునేందుకు కేవలం
నాలుగంటే నాలుగే రోజుల సమయం పట్టింది.

అబ్బే మాకెమి అవ్వదు మాది భారతదేశం మాకు స్వేచ్ఛ స్వతంత్ర్యాలు ఎక్కువ మా ఇష్టం అనుకుంటే మాత్రం
మీకు యమధర్మ రాజు అపాయింట్మెంట్ ఇచ్చారని
నిర్ధారణకు రావొచ్చు. ప్రపంచమంతా వైరస్ అతివేగంగా వ్యాపిస్తోంది. రాబోయే రోజుల్లో ఊహించని విధంగా మరణాలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గృహమే కదా స్వర్గ సీమ అనుకుంటూ
ఇంట్లోనే ఉంటూ శుభ్రతతో మెలగండి ఇప్పటికే మనదేశంలో రెండో దశలోన్నాం లేదంటే మూడో దశ వచ్చిందంటే
మీ ప్రాణాలు మీ కుటుంభ సభ్యులు, మన దేశంలో అందరికి వైరస్ వ్యాప్తి రాకెట్ స్పీడుతో వచ్చేస్తుంది. జనం ఓ జనం
జర జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాల్ని దేశాన్ని కాపాడండి.
ఓ భారతీయుల్లారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవండి.