పోలీసుల కృషితో వలస కూలీల ఆకలిదప్పులు తీరాయి

లాక్ డౌన్ లో స్ఫూర్తిగా నిలుస్తున్న రామగుండం కమీషనరేట్ పోలీసులు. విధులతో పాటు నిర్విరామంగా కొనసాగుతున్న సేవలకు స్పందిస్తున్న దాతలు. వలస కూలీల ఆకలి దప్పికలు తీర్చడానికి నిత్య అన్నదాన కార్యక్రమాలు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో వలస కూలీల ఆకలి దప్పికలు తీర్చడానికి నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

అందులో భాగంగా ఈరోజు ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ గార్డెన్లో వలస కూలీలకు అన్నదానం చేశారు. పోలీస్ కమిషనర్ సత్యనారాయణ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పనులు లేక ఆర్థికంగా నష్ట పోయి తమ సొంత రాష్ట్రాలకు ట్రైన్ ద్వారా వెళుతున్న జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వలస కూలీలకు భోజనలను అందించారు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనుగుణంగా వలస కార్మికులను గుర్తించి ఆకలితో సరిహద్దులు దాటకుండా భోజనము, సదుపాయాలు కల్పించి, ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి స్వగ్రామాలకు పంపించడం జరుగుతుందని సిపి అన్నారు.