నూతన త్రిభాష చిత్రం కాంట్రాక్ట్ విజయంపై ధీమాతో సోనీ చరిష్ట

సోనీ చారిష్ట నూతన చిత్రం తమిళంలో ఇరువర్ ఒప్పందం ఈ చిత్రం తెలుగు, కన్నడ భాష లలో కాంట్రాక్ట్ గా రిలీజ్ అవ్వబోతు ఉంది.ఈ చిత్రం లో ఆక్షన్ కింగ్ అర్జున్ తో తెరను పంచుకొనుంది. ఇతర ముఖ్య పాత్ర లలో జే. డీ. చక్రవర్తి, రాధిక కుమారస్వామి నటించనున్నారు. ఈ చిత్రం లో తన అనుభవం గూర్చి చెబుతూ అర్జున్ గారు ఎంతో గొప్ప నటుడు మాత్రమే కాకుండా గొప్ప మానవతావాది అని ఈ చిత్ర సమయంలో ఆయన తన సహా నటులను ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా చూసుకున్నారు అని తను ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చకున్నాను అన్నారు.

ఈ చిత్రంలో తన తో పాటు నటించిన రాధిక కుమారస్వామి గొప్ప నటి అయినప్పటికీ చాలా సాధరణంగా ఉంటారని ఆమె ఈ చిత్ర సమయంలో గొప్ప సహకారం అందించారని చెప్పుకొచ్చారు. ఈ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ సమీర్ గారు ఈ అవకాశాన్ని కల్పించి నందుకు కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. ఈ చిత్రం గొప్ప విజయం సాధించి తనకు మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.