చరిత్రలో ఫస్ట్ టైం టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్లో భారత్

చరిత్రలో ఫస్ట్ టైం టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్లో భారత్..

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఈరోజు జరగాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కారణంగా పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ కంటే మెరుగైన స్థానంలోన్న భారత్ జట్టుని విజేతగా ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అర్హత సాధించింది.

భారత్ జట్టు టోర్నమెంటులో ఆడిన తొలి మ్యాచ్‌ లోనే ఆస్ట్రేలియాని 17 పరుగుల తేడాతో ఓడించింది. అక్కడి
నుంచి అప్రతిహతంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లని మట్టికరిపించి మహిళల జట్టు సెమీస్‌ స్థానానికి అర్హత సాధించింది. భారత్‌తో ఆదివారం ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడనుంది.