తాండవం చేస్తోన్న కరోనా వైరస్ కారణంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ బెంబేలెత్తిపోతోంది. కానీ భారత్, చైనా దేశాలకు ఆర్ధిక మాంద్యం ప్రభావం అధికంగా ఉండదని ఐక్యరాజ్యసమితి ఊరటనిచ్చే వ్యాఖ్యలు చేసింది. కరోనాతో ప్రపంచ ఆర్ధిక మాంద్యంలోకి జారుకుంటుందని హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం తక్కువేనని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లౌక్డౌన్ జరుగుతుండటంతో ఐక్యరాజ్యసమితి వాణిజ్య,
అభివృద్ధి విభాగం ఓ నివేదికను విడుదలచేసింది.
మార్చి 2020 చివరి నాటికి ప్రపంచమంతా ఎగుమతులు-దిగుమతులు స్తంభించాయి. పర్యాటకం కుదేలైంది అలాగే వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం పన్నుల ఆదాయం పడిపోతోంది. మున్ముందు పరిస్థితి ఊహించనంతగా జఠిలం అవుతోందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంకు లెక్కల్లో అన్ని దేశాల్లో 1.10 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతారని చెబుతున్నాయి. తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల్లో 2020 చివరికి 2.1% శాతంగా వృధ్ధి లెక్కవేశారు.
రాబోయే రెండేళ్లలో కరోనా వైరస్ బాధిత దేశాలు 3ట్రిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను కోల్పోయే ప్రమాదం ఉందని అంచనావేసింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలు
2.5లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక ప్యాకేజీని కనీసంగా అభివృద్ధి చెందుతోన్న దేశాలకు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని నివేదికలో సూచించింది. అయితే చైనా, భారత్లు ఈ మాంద్యం నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న ఐక్యరాజ్య సమితి అందుకు కారణాలను నివేదికలో వివరించ లేదు.