ప్రపంచంలో కరోనాతో 16515 మృతులు

ప్రపంచంలో కరోనాతో 16515 మృతులు

మీకు అర్థమవుతోందా? కరోనా భూమిపై ఇప్పటి వరకు ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన వైరస్. మన దేశంలో 125కోట్ల జనాభా మనం మాత్రం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాము. అయ్యా బాబు అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నాయి కానీ మనకు స్వేచ్చ ఎక్కువ కదా ఏమన్నా అంటే ప్రజాస్వామ్యం మా ఇష్టం అంటారు. అయ్యా మీకు మా విజ్ఞప్తి ఆంక్షలు విధించింది, లాక్ డౌన్ ప్రకటించింది ధనము కోసం, రాజకీయాల కోసం, స్వార్ధం కోసం కాదు. దేశంలోన్న ప్రజలందరి ప్రాణాలు సురక్షితంగా కాపాడేందుకు. ప్రపంచంలో మార్చి 24 మంగళవారం వరకు 16515మంది కరోనాతో చనిపోయారు. కారణం ఒక్కటే నిర్లక్ష్యం. విదేశాల్లో ముఖ్యంగా చైనా, ఇటలీ, ఇరాన్, అమెరికాలాంటి దేశాలు సూచనలు, మార్గదర్శకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రజలు పెడచెవిన పెట్టడం. మనం భారతీయులం మన ప్రాణాలను కాపాడుకుంటూ దేశ సేవ
చేయాలంటే ఒక్కటే మార్గం ఇంట్లోనే ఉండటం.అత్యవసరం ఐతే తప్ప బయటకు రాకుండా ఉండటం. అయ్యా బాబు నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం మీ ప్రాణాలు పోతాయని కాదు అందరి ప్రాణాలకు ముప్పు ఉపద్రవం వచ్చి పడింది. మనిషి మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతోంది. జాగ్రత్త హెచ్చరిక గృహమే స్వర్గ సీమ మరవొద్దు మొద్దుగా మొబ్బుగా వ్యవహరించ వద్దు.

ప్రపంచంలో మరణాలు16515 ఆ వివరాలు చదివైన, పరిశీలించైనా భయం తెచ్చుకోండి మీ అందరి ప్రాణాలు కాపాడుకుంటారని ఆశిస్తూ కింద పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. కరోనాతో పోరాడుతోన్న వ్యక్తుల సంఖ్య 379080మంది. ఈ కింది పట్టికలో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలున్నాయి. కింది పట్టికలో

దేశం అలాగే కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య ఆ తర్వాత ఆయా దేశాల్లో మృతుల వివరాలు రెండో వరుసలో ఉన్నాయి గమనించగలరు.