ఏప్రిల్ 7th ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా మనం అందరం మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, సుఖ సంతోషాలతో ఉండటం కోసం ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా కోవిడ్19 మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాన్ని ధైర్యంగా ముందుండి నడిపిస్తున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలందరికీ మన కృతజ్ఞతలను పునరుద్ఘాటిద్దామన్నారు.
ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన ప్రాణాలను కాపాడే సామాజిక దూరం పద్ధతిని ఖచ్చితంగా పాటిద్దాం. అలాగే ఇతరుల ప్రాణాలను కాపాడుదాం. ఇది మనం మన వ్యక్తిగత శారీరక దృఢత్వంపై ఏడాది పొడవునా దృష్టిపెట్టేలా మనకు ప్రేరణ ఇవ్వగలదని మొత్తంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడగలదని ఆకాంక్షిద్దాం.