ఇంట్లోనే కరోనా క్వారంటైన్ కసరత్తు

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న నేఫథ్యంలో దేశ జనాభాలో 100% ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కరోనా వైరస్ మహామ్మారి నుంచి ప్రజలను తప్పించడానికి కేంద్ర ప్రభుత్వం మనదేశంలో 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చిన్నపెద్ద వాళ్లందరూ, పేదలు సంపన్నులు, సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ ఇంటికే పరిమితమయ్యేలా చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాలను

ఈ వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. భారత్‌లో ఈ లాక్‌డౌన్‌ 21 రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఈ అవకాశాన్ని మేం ఫిజికల్ ఫిట్‌గా తయారవ్వాలి అని అనుకునే వాళ్లకు చక్కగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. లాక్ డౌన్ కారణంగా నిత్యం వ్యయమశాలకు వెళ్లే వ్యక్తులు అంతరాయం కలిగింది. ఈ నేఫథ్యంలో చాలా మంది ఇంట్లోనే వ్యాయమం చేస్తున్నారు. రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు ఏ పార్క్‌కో, జిమ్‌కో, ఫిట్‌నెస్‌ సెంటర్‌ వెళ్తుండే వాళ్లు అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఇవేవి ప్రస్తుతం అందుబాటులో లేవు. WHO పెద్దలు కనీసం రోజుకు అరగంటసేపు వ్యాయామం చేయాలని సూచించింది. పిల్లలు ఓ గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని సూచించింది. అయితే లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో ఉంటూనే వ్యాయామాలు చేస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

మానసిక ఒత్తిడి తగ్గేందుకు ప్రశాంతగా నిద్రపోవడానికి కూడా వ్యాయామాలు దోహద పడతాయని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వ సంస్థలో పనిచేసేవారు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఇంటి నుంచే పనిచేస్తున్న వ్యక్తుల మధ్యలో బ్రేక్‌ ఇస్తూ అప్పుడప్పుడు లేచి నిలుచోవాలని, బాడీని కదుపుతూ పనులు చేయాలని తెలిపింది. వర్క్‌ ఫ్రం హోం చేసేవారు సరైనా పద్దతిలో కూర్చోని పని చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో ఇంటివద్ద నుంచే వ్యాయామం చేయడానికి ఉన్న కొన్ని మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం.

వ్యాయమం చేయటం ఎలా?
యూట్యూబ్‌, టీవీల్లో, సోషల్ మీడియాలో, ఈ మద్య వ్యాయామానికి సంబందించి యాప్స్ కూడా ఇంటర్ నెట్లో అందుభాటులో ఉన్నయా వాటిని చూస్తే మనకు ఎలా వ్యాయామం చేయ్యాలో ఆర్థమవుతుంది. ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరగడంతో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచ మన చేతిలో ఉన్నట్లే అనుకోవాలి ముఖ్యంగా గూగుల్‌లో దొరికిన విషయం అంటూ ఏమిలేదు. వ్యాయామానికి సంబంధించి అయితే యూ ట్యూబ్‌లో, సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వీడియోలు ఉన్నాయి. మరీ ఇంట్లోనే ఉండి ఫిట్‌నెస్‌ పొందాలి అనుకునే వారు ఈ వీడియోలు చూస్తూ వ్యాయామం చేయవచ్చు. ప్రస్తుతం మనలో స్ఫూర్తి నింపడానికి చాలా మంది ఫిట్‌నెస్‌ ట్రైనర్‌లు కూడా అనేక వీడియోలను ఇప్పుడ షేర్‌ చేస్తన్నారు. ఎప్పటిలాగే మీరు ఫిట్‌గా ఉండటానికి చేసే ప్రయత్నాలను వాయిదా వేస్తూ ఉంటే ఈ లాక్‌డౌన్‌ కాలాన్ని చక్కగా ఉపయోగించుకోగలరు.

డాన్స్‌ చేయండం ద్వారా కూడా వ్యాయామం అవుతుంది అది ఎలా? ఇంట్లో కూర్చోని తినడం వల్ల బరువు పేరిగే అవకాశం ఉంది అందుకోసం కేలరీలను కరిగించుకోవడానికి మరో చక్కని మార్గం డాన్స్‌ చేయడం. ఇంట్లో ఉంటూనే మీకు ఇష్టమైన పాటలు పెట్టుకుంటూ డాన్స్‌ చేయండి. దీని వల్ల మీకు ఆనందంతో పాటు మీ శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుందని తెలుసుకోండి.

స్క్రీప్పింగ్ – ఇంట్లోనే ఉంటూ ఒక తాడుతో వ్యాయామం చేయోచ్చు. స్కిప్పింగ్‌ రోప్‌తో ఎగురుతూ మీ ఇంటి టెర్రస్‌ పైనే వ్యాయామాన్ని చక్కగా పూర్తిచేయవచ్చు. అలాగే స్కిప్పింగ్‌ చేయడం వల్ల చాలా ఎక్కువ కేలరీలు ఖర్చుఅవుతాయి. ఇంట్లో ఉండి చేసే వ్యాయామాల్లో స్కిప్పింగ్‌ రోప్‌ను బెస్ట్‌ అని చెప్పవచ్చు.యాక్టివ్‌ వీడియో గేమ్‌లు ఆడటం: ఆటలు శరీరానికి మంచి వ్యాయామం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బయట తిరగలేం కాబట్టి యాక్టివ్‌ వీడియో గేమ్స్‌ ఆడుకుంటూ మనల్ని మనం యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇలాంటి ఆటలు ఆడటం వల్ల ఫిజికల్‌ యాక్టివిటి జరుగుతుంది. దీంతో కేలరీలు కూడా కరుగుతాయి. మీరు మీకిష్టమైన ఆటలాడుతూ వ్యాయామం కూడా ఒకేసారి చేయవచ్చు. ఇలా చేయండి మీ శరీరాన్ని బలంగా ఉంచుకోండి.