లాక్‌డౌన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక

కరోనాపై పోరులో భాగంగా ఇన్నాళ్లూ విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రపంచ దేశాలు సడలిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది.

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే కరోనా వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు డబ్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. జెనీవాలో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్న నేపథ్యంలో వైరస్ ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని తనిఖీ చేసేందుకు అవసరమైన ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైరస్ వ్యాప్తి తగ్గిందని భావిస్తేనే దశల వారీగా మాత్రమే లాక్‌డౌన్‌ను సడలించాలని, లేదంటే వైరస్ తిరిగి వ్యాప్తి చెందే అవకాశం ఉందని టెడ్రోస్ అన్నారు. ఆ సంస్థ ఎపిడమాలజిస్ట్ వాన్ కెర్దోవ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.