నారీ శక్తి పురస్కారాలు

ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ నారీ శక్తి పురస్కారాలు సొంతం చేసుకున్న మహిళలతో సమావేశమయ్యారు. ఈ మహిళలు అనుకున్న పనులు యజ్ఞంలా పూర్తిచేశారని పురస్కారాలు అందుకున్న మహిళలను ప్రధాని ప్రశంసించారు. జీవితంలో ఏదైనా విలువైన పని చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లడం దేశంలోని అందరి మహిళలకు ఆదర్శప్రాయమన్నారు.
ఇవాళ అంతర్జాతీయ మహిళాదినోత్సం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పలు రంగాల్లో రాణించిన మహిళలకు నారీ శక్తి పురస్కారాలు ప్రదానం చేసారు.