తిరుపతి లోక్‌స‌భ‌ ఉప ఎన్నికకు నామినేష‌న్ వేసిన వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి

తిరుపతి లోక్‌స‌భ‌ ఉప ఎన్నికకు నామినేష‌న్ వేసిన వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి

వైసీపీ పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో తిరుపతి లోక్‌స‌భ‌ ఉప ఎన్నికకు త్వ‌ర‌లోనే పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు నెల్లూరు కలెక్టరేట్‌లో మూడు సెట్ల నామినేషన్ దాఖ‌లు చేశారు.అంత‌కు ముందు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాల‌యంలో దివంగత వైఎస్సార్‌ విగ్రహం వ‌ద్ద‌ నివాళులు అర్పించారు. ఆ త‌ర్వాత వీఆర్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏపీ సీఎం‌ జగన్ ఆశీస్సులతో నామినేషన్ వేస్తున్నానని గురుమూర్తి చెప్పారు. త‌న‌కు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని తెలిపారు.కాగా, గురుమూర్తి‌ది చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మన్నసముద్రం దళితవాడ. స్విమ్స్‌లో ఆయ‌న‌ ఫిజియోథెరపీ పూర్తి చేశారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలో గురుమూర్తి కూడా పాల్గొన్నారు.