చస్తావా? బ్రతుకుతావా? మీ ఇష్టం

ముచ్చటగా మూడే ఎంపికలు? మీ ఇష్టం మరణమే?

నిన్న మొన్నటి వరకు బ్రతకాలంటే డబ్బే అన్నిటికీ మూలం.
కానీ గత కొన్ని రోజులుగా మన జాగ్రత్తలే మనకు శరణ్యం. కరోనా వైరస్ కు పేద-ధనిక తారతమ్యం లేదు ఒకే ఒక్క విషయం తెలుసు, వైరస్ సోకడం చంపేయడం. అందుకే
నువ్వు ఎలా పుట్టావో నీ చేతుల్లో ఉండదు కానీ ఎలా చావలో నీ చేతుల్లోనే ఉంటుంది. నీ బ్రతుకుకు అర్థం పరమార్ధం లేకుండా చస్తావా లేక నీ కోసం నీ కుటుంభం కోసం దేశం కోసం కృషి చేస్తావా? అనుకున్నది సాధిస్తావా నీ ఇష్టం.

కనీసం ఇప్పటికైన నిర్లక్ష్యం చేస్తోన్న వాళ్ళందరూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తోన్న కరోనా వైరస్ కట్టడి నిర్ణయాల అమలుకు దేశ ప్రజలు సహకరించాలి. కాదు కూడదు మా ఇష్టం ప్రజాస్వామ్యం మా హక్కు అంటే మీ ముందున్నవి మూడే మూడు ఎంపికలు. ఇది మీకు ఇబ్బంది కలిగించేందుకు చెప్పడం లేదు ఓ హెచ్చరిక. మీ ఇష్టానుసారం చేస్తే మీకే కాదు సమాజానికే చేటు. ఆర్థం చేసుకోండి ఆచరించండి.

మన భారతదేశములోన్న 125 కోట్ల ప్రజల ముందున్న మూడే మూడు ఎంపికలు.
NO 1. కరోనాపై అవగాహనతో ఇంట్లో ఉండడం. మన ప్రాణాలకు క్షేమం అలాగే సమాజ హితం. దేశానికి మనం చేసే సేవ ఇదొక్కటే.
NO2. కరోనా కట్టడి నిర్ణయాలను పాటించకపోతే వైరస్ సోకే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మీకు ఆస్పత్రిలో
ఓ మంచం సిద్ధంగా ఉంటుంది. మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలను బలి తీసుకుంటుంది.
NO3. కరోనా కారణంగా కన్నుమూస్తే మీకు మిగిలేది మీ ఇంట్లో ఓ ఫోటో ఫ్రేమ్ మాత్రమే. అంతేకాక మీ తల్లిదండ్రులు, కుటుంభ సభ్యులకు తీరని అన్యాయం, లోటు చేసిన వారుగా నిలబడిపోతారు.