అమెరికాలో ఘనంగా YSR జయంతి వేడుకలు

డాక్టర్ YSR జయంతి కార్యక్రమంను అమెరికాలో NRI’s ఘనంగా నిర్వహించారు. YSR గత స్మృతులను స్మరించుకుంటూ మహనేత పేద ప్రజల అభ్యున్నతి, రాష్ట్రాభివృద్ధి, రైతు పక్షపాతిగా చేసిన సేవలు, ఉచిత కరెంట్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నారు.

YSR తండ్రి అడుగు జాడల్లో తనయుడు YS జగన్మోహన్ రెడ్డి రైతులతో పాటు విద్య వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉంచడంతో పాటు కరోనా పరీక్షలు నిర్వహించి దేశంలోనే AP రాష్ట్రం No1 స్థానంలో నిలుపుతూ ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రవాస ఆంధ్రులు అభిప్రాయబడ్డారు, అలాగే ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ NRI సభ్యులు రఘునాథ్ రెడ్డి, ఎల్వీ కిరణ్, వినిత్ లోకా, నరేన్ ఒదుల, గల్లా మదన్న, అర్జున్ కామిశెట్టి, వినయ్ మాదాసు పాల్గొన్నారు.