పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో YSRCP డిమాండ్స్

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో YSRCP డిమాండ్స్

ఢిల్లీలో విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మీడియాతో మాట్లాడారు.

కేంద్రం రైతులకు కనీసం మద్దతుధర చట్టం తీసుకురావాలని, 24 పంటలకు కనీస మద్దతు ధర ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పిస్తున్నారు. అదే పద్ధతిని దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి.

ఆహార భద్రత చట్టం అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆ విషయాన్ని సరిదిద్దాలి. అణగారిన బీసీలను గుర్తించేందుకు సామాజిక ఆర్థిక కుల గణన చేయాలి. మహిళా రిజర్వేషన్లు బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రానికి సంబంధించిన దిశ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలి, లేకపోతే కేంద్రం భరించాల్సి ఉంటుందన్నారు.

చంద్రబాబును ఎవరు తిట్టలేదు, అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు ఏడుపు ఒక డ్రామా, ఆయన నాటకాలు ఎవరూ నమ్మరు. చంద్రబాబు యాక్షన్ కు రియాక్షన్ తప్పదు.

జనాభా లెక్కలు బాధ్యత కేంద్రానిదే, కులాల వారిగా లెక్కలు తీస్తే లెక్కలకు న్యాయం జరుగుతుంది. నేషనల్ ఫుడ్ సెక్యురిటి ఆక్ట్ కింద రాష్టానికి అనాయ్యం జరిగింది. కనీస మద్దతు ధరపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కోరాం. మూడు వ్యవసాయ చట్టాల రద్దును స్వాగతిస్తున్నాము.