జనం జాగ్రత్తలతో జీవించాలి. YSRCP MP విజయసాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మాట్లాడుతూ దేశంలో కరోనా నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్ డౌన్ విధానంకు ప్రజలు అందరూ సహకరించండి. ఇంట్లోనే ఉండండి…అన్ని జాగ్రత్తలు తీసుకోండి..వేరే దారి లేదు. కొన్ని నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే అయినా ప్రజల ప్రాణాలే మిన్న అని సీఎం వైఎస్ జగన్ భావించారు. ఎందరో సేవ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా ముందుకు రావాలి అయితే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. వైద్యులు, వాలంటీర్లు, పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అందరూ ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి ప్రజలకు సేవలు అందించాలి.

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో నలందా ఎడ్యుకేషన్ సొసైటీ మరియు వరప్రసాదరెడ్డి-విజయ శారదారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు వేలమంది పేదలకు నిత్యావసరవస్తువులు,పౌష్టికాహారం డోర్ డెలివరీ చేసేందుకు బయల్దేరుతున్న వాహనాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.