తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిసి

తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిసి

APEC రమేష్ కుమార్ పేరుతో పత్రికల్లో వచ్చిన లేఖ ఆయనే రాసినట్లు భావిస్తున్నాం. వివాదాస్పద అంశాలతో కూడిన
ఆ లేఖను రమేష్‌ కుమార్ రాయకపోతే దానిని ఖండించాల్సి వుంది. కానీ ఇప్పటి వరకు దానిని ఖండించకపోవడం వల్ల ఆయనే రాసి వుంటాడని అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఆయనను ఆ పదవి నుంచి ఎలా తొలగించాలో ఆలోచిస్తాం.
ఈ లేఖ ఎక్కడ తయారైంది, ఎవరు ఇచ్చారో తేలాల్సి వుంది.
దీనిపై పై స్థాయిలో ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం. సదరు లేఖ ప్రతులతో టిడిపి ఆఫీస్ వద్ద కొందరు వ్యక్తులు, నాలుగైదు చానెల్స్ హడావుడి చేశాయని తెలిసింది. వారి చేతుల్లోనే ఈ లేఖ ప్రతులు వున్నట్లు తేలింది. ఈ కుట్రలో వారు కూడా భాగస్వాములే, ఎవరినీ వదలం. రాష్ట్రంలో ఏమీ లేకపోయినా ఏదో జరుగుతోందనే భ్రమలను కల్పించారు. తనపైన ఏదో జరిగిపోతోందని రమేష్ కుమార్ క్రియేట్ చేస్తున్నారు.
దానికి వత్తాసు పలుకుతూ టిడిపి ఎల్లో మీడియాలో కథనాలు రాశారు. ప్రజల్లో నిత్యం మమేకమైన పార్టీగా మా విధానం మాకు వుంది. ఇవ్వన్నీ ప్రజల్లోకి తీసుకువెడతాం, పార్లమెంట్ లో ప్రస్తావించాలా, కోర్ట్ తలుపులు తట్టాలా అని అన్ని ఆప్షన్లను పరిశీలిస్తాం.

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామికంగానే మేం గెలుచుకుంటాం…
రాష్ట్రంలో జనాలకు ఏదో జరిగిపోతోందనే భ్రమలను కల్పిస్తున్నారు. భయంకరమైన హింస జరుగుతోందనే అవాస్తవాలను ఎల్లో మీడియాలో ప్రసారం చేస్తున్నారు.
కేంద్రమే కాపాడాలంటూ ఎల్లో మీడియాలో రమేష్ కుమార్ వ్యాఖ్యలు అంటూ రాస్తారు. ఆఖరిలో రమేష్ కుమార్ ఈ వ్యాఖ్యలను ధ్రువీకరించలేదని చిన్నగా రాస్తారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక వ్యక్తి పేరుతో భారీ రాతలు రాసి, ఆఖరున ఆయన నిర్థారించలేదంటూ రాస్తారా? ఇటువంటి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలో వుండటానికి అనర్హుడు.
మానసిక సమతూల్యత లేని వ్యక్తి రమేష్ కుమార్.
ఒక పార్టీ కార్యకర్తలాగా… లోపాయికారి ఏజెంట్ లాగా, అసహ్యంగా రమేష్ కుమార్ వ్యవహరించాడు.
ఆయనకు మనిషికి వుండే లక్షణాలు వుంటే రాజీనామా చేయాలి.

రాష్ట్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందకు జరిగిన కుట్రగా లేఖ వివాదంను పరిగణిస్తున్నాం.ఎన్నికల వాయిదా అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ లేఖను బయటకు తీసుకువచ్చారు. ప్రభుత్వంపై విపరీతమైన ఆరోపణలు చేస్తే…
ప్రభుత్వం దానిని సమాధానం చెప్పుకునే లాగా ఈ సమస్య పక్కకు పోతుందనే కుట్ర వుంది. దానికి తగినట్టే ఊతం ఇచ్చేట్టుగా మీడియాలో కథనాలు ఇస్తున్నారు.
రాష్ట్రం అంతటా కూడా విషబీజాలు నాటేందుకు ఎల్లో మీడియా ఈ హంగామా క్రియేట్ చేసింది. ఈ ఆరోపణలు వచ్చిన 18 గంటలు గడిచినా ఇంకా రమేష్ కుమార్ ఆ లేఖపై స్పష్టత ఇవ్వలేదు. ఆయనే ఈ లేఖ ఇచ్చారని అనుకుంటే
ఆ లేఖ రాయడంలో రమేష్‌ కుమార్ ఉద్దేశం ఏమిటీ?
ఈనెల 15 వ తేదీన ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటించిన రోజు రమేష్ కుమార్ తీసుకున్న వైఖరికి భిన్నంగా ఆయన రాసినట్లు చెబుతున్న లేఖలో వుంది. అందులో ప్రస్తావించిన భాష కూడా వీధిస్థాయి వ్యక్తులు ఉపయోగించే చౌకబారు ఆరోపణలు వున్నాయి. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో వున్న వ్యక్తి చేసినట్లుగా ఆ ఆరోపణలు లేవు
సంధిప్రేలాపనలతో, మతిస్థిమితం లేని వారు చేసినట్లుగా ఆ ఆరోపణలువు వున్నాయి. రమేష్ కుమార్ 15వ తేదీన ఏకగ్రీవాలు అన్ని చెల్లుబాటు అవుతాయని చెప్పారు.
నిన్న ఆయన పేరుతో బయటకు వచ్చిన లేఖలో ఏకగ్రీవాలు దౌర్జన్యాల వల్ల జరిగాయంటూ ఆరోపణలు చేశారు.
వాయిదా ప్రకటన ముందు రోజు వరకు ఎక్కడైనా దౌర్జన్యాలు జరిగితే చర్యలు తీసుకుంటున్నామని రమేష్‌ కుమార్ స్వయంగా చెప్పారు. వాయిదా రోజున కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు.
కానీ ఆయన పేరుతో వచ్చిన లేఖలో అంతటా దౌర్జన్యాలే జరిగాయని పేర్కొనడం విడ్డూరంగా వుంది.

జగన్ గారిని, ఈ ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు సృష్టించుకున్న తోలుబొమ్మ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్
చంద్రబాబు తనకు ఇష్టం వచ్చినట్లు ఆ బొమ్మను ఆడిస్తున్నాడు. కౌన్సిల్ లో చైర్మన్ ను విచక్షణాధికారం పేరుతో ఆడించినట్లు రమేష్‌ కుమార్ ను కూడా రిమోట్ తో విచక్షణాధికారం అని చంద్రబాబు ఆడిస్తున్నాడు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఏ ప్రభుత్వం అయినా ఏకగ్రీవంగా వుండాలని ప్రోత్సహిస్తాయి. కడప, కర్నూలు, నెల్లూరు, విజయగనగరం జిల్లాల్లో ఎక్కువశాతం ఏకగ్రీవాలు జరిగాయి.
మేం అమలు చేసిన పథకాల వల్ల సీఎం గారి పట్ల అన్ని వర్గాల్లో విశ్వాసం పెరిగింది. రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ కమిషన్ వంటి పారదర్శక విధానాలు మంచి పేరు తెచ్చాయి.
అందుకే ఈ సారి మాకు అనుకూలంగా ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబే తమ పరిస్థితిని ఒప్పుకున్నాడు. ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడలేని భాషను ఉపయోగించాడు. ఒకరకంగా అస్త్రసన్యాసం చేస్తున్నట్లు అంగీకరించాడు. రెండోతరం ముందుకు రావాలంటూ పిలుపునిచ్చాడు. టిడిపి ఖాళీ అయ్యింది, పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సంక్షేమ పథకాల పట్ల ప్రజలు వైఎస్ఆర్ సిపికి మద్దతుగా వున్నారు.
దీనిని గమనించి చంద్రబాబు భయాందోళనలకు గురయ్యాడు.
అస్త్రసన్యాసం చేస్తూ చంద్రబాబు చేతులెత్తేశాడు.
ఎన్నికల సందర్బంగా చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే వుంటాయి. టిడిపికి కూడా ఏకగ్రీవాలు
జరిగాయి అక్కడ మీరు దౌర్జన్యం చేశారా?

సీఎం జగన్ గారిపై ప్రజల అభిమానంను తగ్గించాలని చంద్రబాబు ప్రయత్నించడం వృధా చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ ద్వారా రాయించిన రాతలు మీడియాకు లీక్ లు ఇచ్చి రాయిస్తున్న రాతలు ప్రజలకు తెలుసు. ప్రతిపక్షంలో వుండి చంద్రబాబు క్రమంగా బలహీనపడుతున్నాడు. టిడిపిని ఎంతమంది వీడిపోతున్నారో రాజ్యసభ ఎన్నికల్లో తెలుస్తుంది.
తనతో పాటు ఎంత మంది ఎమ్మెల్యేలు వున్నారో చెక్ చేసుకునేందుకే వర్ల రామయ్యను పోటీకి దింపాడు.
ఎస్సీ అభ్యర్ధిని రంగంలోకి దింపి, ఓడిపోతాడని తెలిసి కూడా మోసం చేస్తున్నాడు. చంద్రబాబు పార్టీలో వున్న బేస్ కదిలిపోతోంది. చంద్రబాబుకు సమీప భవిష్యత్తులో రాజకీయంగా ప్రజలు బుద్ది చెబుతారు.
ఈ ఎన్నికలు అయిపోతే మూడేళ్ల పాటు అభివృధ్ధి తప్ప మరొకటి వుండదు అప్పటికి చంద్రబాబు కనుమరుగు అయిపోతాడు. ఈ కొద్ది రోజులు చంద్రబాబును భరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఎన్నికల ముందు నుంచి చంద్రబాబు మాట్లాడుతున్న భాష, ఆయన సృష్టించిన మాయాలను గమనిస్తున్నాం.
గతవారం నుంచి నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుతో అవి కలుస్తున్నాయి. గత ఆదివారమే దీనిపై అనుమానాలు వచ్చాయి. ఈరోజున రమేష్ కుమార్ లేఖ అంటూ జరుగుతున్న వార్తలతో అది నిజమని నమ్మతున్నాం.
చంద్రబాబు తానే స్ర్కిప్ట్ రాసుకుని, తాను అనుకున్న అంశాన్ని క్రియేట్ చేసుకుంటాడు. వాటిని ప్రసారం చేయడానికి సోషల్ మీడియా, తనకు అనుకూల ఎల్లో మీడియాను వాడుకుంటాడు. ఢిల్లీకి వెళ్లి దానిపైన వినతిపత్రాలు ఇస్తాడు. ఇదీ చంద్రబాబుకు అలవాటు. రమేష్ కుమార్ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో వుందా?
అటువంటిది లేకపోయినా సరే వాటిని ఎల్లో మీడియాలో విస్త్రతంగా ప్రచారం చేస్తారు. ఎల్లో మీడియా ద్వారా మామీద వేసిన బురద వేసి కడుక్కోమంటారు.

గ్రామస్థాయిలో బాధ్యతతో పనిచేసే ప్రజాప్రతినిధులను ఎన్నిక కావాలన్న ప్రభుత్వ ఆశయంపై నీళ్లు జల్లారు.
కరోనా నష్టాలను ఎదుర్కొవడానికి ఇప్పటికే వున్న వలంటీర్ల వ్యవస్థ వుంది. వారికి తోడుగా బాధ్యతాయుతమైన స్థానిక నాయకత్వం కావాలని సీఎంగారు కోరుకున్నారు.
కుట్రతో దానిని వాయిదాతో దెబ్బతీశారు.
దీనితో రాష్ట్రంను ఆరోగ్యపరంగా కొంత ప్రమాదకర స్థితిలోకి నెట్టారు . 1.34 కోట్ల కుటుంబాలను సర్వే చేసి, 8500 మంది విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు చేయించాం.
దేశంలోనే మనకు వున్న వలంటీర్ల వ్యవస్థలాంటిది ఇతర రాష్ట్రాల్లో లేదు. దానికి స్థానిక నాయకత్వం జత అయితే మరింత పకడ్బందీగా నియంత్రణ వుండేది.