స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు YSR కాంగ్రెస్: ఎంపీ విజయసాయి రెడ్డి

స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు YSR కాంగ్రెస్: ఎంపీ విజయసాయి రెడ్డి

-ఎన్నికలను వాయిదా వేసిన అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. ఎన్నికల కమిషనర్ నిర్ణయం అప్రజాస్వామికమా? రాజ్యాంగ విరుద్ధమో సుప్రీంకోర్టు తేలుస్తుంది. చంద్రబాబు ప్రయోజనాలకు అనుగుణంగా నిమ్మగడ్డ రమేష్ పనిచేస్తున్నారు. కరోనా కంటే ప్రమాదకారి నిమ్మగడ్డ రమేష్. వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంట్ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ లో అన్నారు.

1.రాష్ర్ట ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి నారావారి రమేష్ అని చెప్పుకోవాలి.
2.కరోనా వైరస్ ఎంతప్రమాదకరమైందో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు.దానికన్నా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఎవరైనా ఉన్నారంటే,రాజ్యాంగ వ్యవస్దలను ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే వ్యక్తి ఎవరంటే అది నిమ్మగడ్డ రమేష్ అని చెప్పుకోవచ్చు.
3.ఒక శునకాన్ని కనకసింహాసనమున కూర్చోబెడితే ఏం చేస్తుందో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమీషనర్ గా అదే పని చేస్తున్నాడనే విషయంలో సందేహం లేదు.
4.ఎవరైనా ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగితే మందులు ఇవ్వచ్చేమోగాని మెదడంతా కలుషితం అయిపోతే ఆ వ్యక్తులను మార్చడం భగవంతుడుకి కూడా వీలుకాదేమోనని నాకు అనిపిస్తోంది.
5.హెల్త్ సెక్రటరీగాని,ఛీఫ్ సెక్రటరీగాని ప్రభుత్వంలో ఎవరిని సంప్రదించకుండా ప్రభుత్వం ఎటువంటి ప్యానిక్ బటన్ నొక్కని నేపధ్యంలో నిమ్మగడ్డ రమేష్ పరిస్దితిని మదింపు చేయకుండానే నిర్ణయం తీసుకున్నారు. కరోనా అనేటటువంటిది ఆంధ్రరాష్ర్టంలోని నాలుగుకోట్ల జనాభాలో ఒకే వ్యక్తి ఇటలీనుంచి నెల్లూరుకు వస్తే అతనిని బిగినింగ్ లోనే ఐసోలేషన్ వార్డులో పెట్టారు.
6. ఎక్కడా కూడా మరణం అనేది ఏపిలో సంభవించలేదు.నిమ్మగడ్డ మైండ్ లో మాత్రమే కెలామిటి అనేది వచ్చింది.తాను ఇచ్చిన నోటిఫికేషన్ లో కన్సల్టేషన్ ప్రాసెస్ విత్ పొలిటికల్ పార్టీస్ అని చెప్పారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయపార్టీకాదా.టిడిపి మాత్రమే రాజకీయపార్టీనా.చంద్రబాబును కన్సల్ట్ చేసి మేము రాజకీయపార్టీలన్నింటిని కూడా కన్సల్ట్ చేశాం.వారందరూ కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారనడం ఒక్క నిమ్మగడ్డ రమేష్ కు మాత్రమే చెల్లుతుంది.
7.ఏ అధికారైనా సరే దేశంకోసం, రాష్ర్టం కోసం, రాష్ర్ట అభివృధ్ది కోసం పాటుపడతాడు.కాని చంద్రబాబు నాయుడుకోసం పనిచేసే రాజ్యాంగ పదవిలో కూర్చున్న నిమ్మగడ్డ రమేష్ ను మాత్రమే చూస్తున్నా.
8.వైద్య,ఆరోగ్యశాఖను,రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని,పోలీసువ్యవస్దను, చివరకు ఛీఫ్ సెక్రటరీని కూడా సంప్రదించకుండా చంద్రబాబు అజెండా ప్రకారం కులపిచ్చివాడిగా,ఎల్లోసూసైడ్ స్క్వాడ్ లో మెంబర్ గా పనిచేస్తున్నాడనే విషయంలో సందేహమే లేదు.
9.రమేష్ కుమార్ కు సిగ్గుంటే నైతికవిలువలు ఉంటే రాజీనామా చేయాలి.తను తీసుకున్న నిర్ణయాన్ని జస్టిఫై చేసుకోవాలి.రాజ్యాంగబద్దమైన నిర్ణయం అనేది తను ప్రూవ్ చేసుకోవాలి.
10.రాష్ర్ట ఎన్నికల కమీషనర్ పదవిపై మా అందరికి కూడా గౌరవం ఉంది.కాని నిమ్మగడ్డ రమేష్ లాంటి ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేసే వ్యక్తిమీద కాదు.అక్కడ దుర్వినియోగం చేసిన వ్యక్తి సొంత ఎజెండాపై చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేసే చంద్రబాబు ప్రయోజనాలను కాపాడేందుకు రాజ్యాంగవిలువలను నైతికవిలువలను తుంగలో తొక్కి చట్ట విరుధ్దమైన నిర్ణయాలు తీసుకునే ఇటువంటి వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని స్పష్టంగా చెపుతున్నాం.
11.తను ఆర్టికల్ 243కే, 243 జడ్ ఏ ఈ రెండింటిని కోడ్ చేశారు.ఎక్సాటార్డినరి సిట్యూయేషన్లో మాత్రమే ఈ ఆర్టికల్ ను ఉపయోగించి ఎన్నికలను పోస్ట్ పోన్ చేయవచ్చుకాని నెల్లూరుకు చెందిన వ్యక్తికి అది ఇటలీలో వచ్చింది.అతను కూడా ఐసోలేషన్ వార్డులో ఉన్నాడు.సేఫ్ గానే ఉన్నాడు.నిమ్మగడ్డ రమేష్ కు ఎందుకు అలా తోచిందో మాకు అర్దం కావడం లేదు.
12.ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ శాడిస్టిక్ సిఎండీస్ డయబాలికల్ యాక్షన్ అని చెబుతున్నాం.నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఇర్రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తున్నారు.కేర్ లెస్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
13.నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబుకు ఉపయోగపడే విధంగా తీసుకుంటున్నారు.ఆ వ్యక్తి ఎన్నికల ప్రాసెస్ ను మ్యానుపులేట్ చేేశారు.టిడిపికి హెల్ప్ చేయడం కోసం.టిడిపి మునిగిపోతున్ననావ దానిని రక్షించడానికి ఇలా చేశారు.
14.కిషన్ సింగ్ తోమార్ వర్సెస్ అహ్మదాబాదు మున్సిపల్ కార్పోరేషన్ అనే కేసును కోడ్ చేశాడు. ఒక్కసారి నిమ్మగడ్డ రమేష్ ప్రశ్నించుకుంటే ఈ రోజు ఏపిలో ఉన్నపరిస్దితులలో ఆ కేసును అన్వయించుకోవచ్చా లేదా అని ఆలోచిస్తే అతనికే తెలుస్తుంది.
15.చంద్రబాబుతో కొల్యూడ్ అయి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రరాష్ర్ట ప్రజలు హర్షిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ….
ఎన్నికల వాయిదా అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం అని చెప్పారు. రాష్ట్రంలో స్దానికసంస్దల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళతామని అన్నారు. ఎన్నికల కమిషనర్ నిర్ణయం అప్రజాస్వామికమా? రాజ్యాంగ విరుద్ధమో సుప్రీంకోర్టు తేలుస్తుందని తెలిపారు. స్థానిక సంస్థలపై ఎన్నికల కమిషనర్ కు రాజ్యాంగపరమైన అధికారాలుంటాయి. వీటిని దుర్వినియోగం చేసే అధికారులను శిక్షించాలంటే కోర్టును మాత్రమే ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు.కేంద్రానికి,గవర్నర్ కు ఫిర్యాదుచేయడంలో తప్పులేదు.కాని అధికారాలు మాత్రం కోర్టుకు ఉంటాయి.

కన్నాలక్ష్మీనారాయణగారు టోటల్ గా చంద్రబాబుకు అమ్ముడుపోయారు.చంద్రబాబు తానా అంటే తందానా అని అంటున్నారు.పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు అడుగుజాడలలో నడుస్తున్నారు.ఇది బిజేపి మనుగడకే ప్రమాదం అనే విషయాన్ని తెలుసుకోవాలని
రాష్ర్ట వ్యవసాయశాఖమంత్రి శ్రీ కురసాల కన్న బాబు అన్నారు.

1.ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది.అధికారం ఉన్నా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది
2.ఎన్నికల కమిషన్ వ్యవస్థ ను నిమ్మగడ్డ రమేష్ భ్రష్టు పట్టించారు.నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్ గా చంద్ర బాబు హయాంలో నియమితులు అయ్యారు..ఆ రుణం తీర్చుకునేలా ఆయన వ్యవహరించారు
3.నిజంగా రాష్ట్రంలో కరోనా వుంటే ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదించా రా ? మీరు చెప్పినట్టు అరు వారాల తర్వాత కరోనా అదుపులోకి వస్తుందని అంచనాలు వేశారు..మీ దగ్గర శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఈ విషయంపై చర్చ అవసరం వుంది.
4.చంద్రబాబు నాయుడు ఏ వ్యవస్థనీ సక్రమంగా నడిచేలా చేయరు.మొన్న శాసనమండలి లో అలాగే వ్యవహరించారు.ఈ ఉగాది కు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే వద్దని కలెక్టర్ లకు ఎస్ ఇసి ఆదేశాలు ఇచ్చారు.
5.చంద్రబాబు మీరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ మోహన్ రెడ్డి ముందు కుప్పి గెంతులే.రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా మద్యం డబ్బు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తే చంద్రబాబు భరించలేక కుట్ర చేశారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.
రాష్ర్ట టూరిజం శాఖమంత్రి శ్రీ అవంతిశ్రీనివాసరావు అన్నారు.

1.కేంద్రం నుంచి రావాల్సిన 5 వేల కోట్లు రాకుండా చంద్ర బాబు నీచంగా కుట్ర పన్నారు.ఎన్నికల వాయిదా అధికారం ఎన్నికల కమిషనర్ కు ఎవరు ఇచ్చారు.నిన్న ఇళ్ళ పట్టాలు పంపిణీ వద్దని మరుసటి రోజు కరోనా కారణం చూపించారు.
2.ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయగలిగారు..కానీ విజయం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే.చంద్ర బాబు కుట్రలను మేధావులు ఖండించాలి