జస్టిస్ రమణకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన వైవీ సుబ్బారెడ్డి

జస్టిస్ రమణకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన వైవీ సుబ్బారెడ్డి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఈరోజు బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ఢిల్లీలో జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ పర్యాటక కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో సీజేఐ దంపతులకు టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి జస్టిస్ రమణను స్వామి వారి వస్త్రంతో సత్కరించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.