ముద్దుగుమ్మల ZERO సైజ్ GYM

ఫిజిక‌ల్ ఫిటెనెస్ హీరోల‌కే అవ‌స‌ర‌మా? సిక్స్‌ప్యాక్ శ‌రీర‌ధారుడ్యంతో తెర‌పై కండ‌ల‌ను చూపించే హీరోల‌కు ధీటుగా ఫిట్‌నెస్‌లో హీరోయిన్లు సైతం పోటీ ప‌డుతున్నారు. హృతిక్ రోషన్,టైగర్ ష్రాఫ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్లెవరూ ఇకపై మీదట పోటీ కానే కాదు! అన్నంతగా మన కథానాయికలు, అందగత్తెలు ప్యాకింగులతో చెలరేగడం చూస్తుంటే హీరోలను సైతం మించిపోతారామోన‌ని అనిపిస్తుంది.

ఫిజికల్ ఫిట్ నెస్ పై హీరోలను మించి హీరోయిన్లలో పట్టుదల పెరిగిందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఒకప్పటిలా బొద్దుగుమ్మలెవరూ కనిపించడం లేదు. తెలిసో తెలియకో ఆరంభం బొద్దుగా కనిపించినా ఆర్నెళ్లకే రూపం మార్చేస్తున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, జాన్వి కపూర్, లాంటి యువ నాయికలే కాదండోయ్ శిల్పా శెట్టి , కత్రిన,అనుష్క, సమంత హీరోయిన్లు కూడా 6ప్యాక్/Zero సైజ్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లను మైమరిపింప చేస్తున్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నా నిరంతరం జిమ్ములకు వెళుతూ చెమట ఒడుస్తున్నారు.